- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGSRTC : జస్ట్ మిస్సయింది! ఆర్టీసీ బస్సుకు తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం
దిశ, డైనమిక్ బ్యూరో: ఆదిలాబాద్ జిల్లాలో టీజీఎస్ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండలం నిర్మల్ ఎక్స్ రోడ్డు దగ్గర ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో అటు వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తమై సడెన్‌గా సైడ్ తీసుకోని బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి సెకన్లలో లారీ స్పీడును కంట్రోల్ చేసి కుడి వైపునకు తిప్పడంతో బస్సు చివరి భాగంలో కొంతమేర డ్యామేజ్ జరిగింది.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. జస్ట్ మిస్సయింది.. అంత మంది జనాల ప్రాణాలను పణంగా పెట్టాడు.. ఆ బస్ డ్రైవర్ రెండు నిమిషాలు ఆగి రోడ్డు దాటితే, తప్పేముందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తెలంగాణ పోలీసులు మామూలు వాహన చోదకులతో పాటు ఇలాంటి ఆర్టీసీ డ్రైవర్స్ కోసం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మరో నెటిజన్ సూచించారు. ఈ ఘటనపై ఆర్టీసీకి ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేయడంతో సంస్థ స్పందించింది. నిర్మల్ డీఎం, ఆదిలాబాద్ రిజినల్ మేనేజర్‌కు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేసింది.