త్వరలో జాబ్ క్యాలెండర్.. యువత వారి ఉచ్చులో పడొద్దు.. : మంత్రి శ్రీధర్ బాబు

by Rajesh |
త్వరలో జాబ్ క్యాలెండర్.. యువత వారి ఉచ్చులో పడొద్దు.. : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తెలంగాణలో అంతర్జాతీయ స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో కస్తూర్బాగాంధీ బాలిక పాఠశాలను మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్యం, విద్యకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్‌ను కడ్తాల్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. వనపర్తిలో ఐటీ పార్క్ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. సర్వారెడ్డి పల్లిలో ఆహార శుద్ధి యూనిట్, ఇండస్ట్రీయల్ పార్క్ తీసుకొస్తామన్నారు. రేపు రైతు రుణమాఫీ చేయబోతున్నామన్నారు. డీఎస్సీ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిందని గుర్తు చేశారు. విపక్షాల ఉచ్చులో యువత పడొద్దని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed