Jishnu Dev Varma: కులగణనలో గవర్నర్ వివరాల సేకరణే ప్రథమం

by Ramesh Goud |   ( Updated:2024-11-09 11:27:53.0  )
Jishnu Dev Varma: కులగణనలో గవర్నర్ వివరాల సేకరణే ప్రథమం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక(social), ఆర్థిక(Economic), విద్య(Eduvation), ఉపాధి(Employment), రాజకీయ(Political), కుల సర్వే(Caste survey)లో భాగంగా కుటుంబాల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు(Enumerators) ఇంటింటికి వెళ్లి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ముందుగా ఉదయం రాజ్‌భవన్‌(Raj Bhavan)లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ(Governor Jishnu Dev Varma) వివరాల సేకరణతో అధికారులు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ కి వెళ్లిన అధికారులు.. గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ కార్యాలయంలో ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ తెలిపిన వివరాలను ప్రభుత్వ ఫారమ్ లో సమగ్రంగా నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ ​కుమార్ సుల్తానియా(Planning Department Principal Secretary Sandeep Kumar Sultania), గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం(Governor Principal Secretary Burra Venkatesham), జిల్లా కలెక్టర్​ అనుదీప్(District Collector Anudeep) తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమాన్ని ఈ నెల 6 న ప్రారంభించారు. ఇందులో ఎన్యూమరేటర్లు మూడు రోజుల పాటు తాము వివరాలు సేకరించాల్సిన గృహాలపై స్టిక్కర్లు వేశారు. ఈ రోజు నుంచి ఆయా గృహాల వివరాలను నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు.

Advertisement

Next Story