‘లక్ష్మీపుత్రుడు కాదు.. లంక పుత్రుడు’.. పోచారంపై జీవన్ రెడ్డి ఫైర్

by Satheesh |
‘లక్ష్మీపుత్రుడు కాదు.. లంక పుత్రుడు’.. పోచారంపై జీవన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు వీర విధేయుడిలా ఉన్న పోచారం అనుహ్యంగా గులాబీ బాస్‌కు షాక్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పోచారం అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

దీంతో పోచారం ఆయన కొడుకు భాస్కర్ రెడ్డితో కలిసి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో పోచారంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు వివిధ పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచారని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పోచారం పార్టీ మార్పుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌లో పోచారం పదవులు అనుభవించారని గుర్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా పోచారం కుటుంబ సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి నీచంగా మాట్లాడారని, ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్లీ ఆయన పార్టీలో చేర్చుకున్నారని ఘాటు విమర్శలు చేశారు. దమ్ముంటే పోచారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో చంద్రబాబు, కేసీఆర్‌కు ద్రోహం చేశారు.. రేపు రేవంత్ రెడ్డిని కూడా మోసం చేస్తారని అన్నారు. కేసీఆర్ అన్నట్లు పోచారం లక్ష్మీపుత్రుడు కాదని, లంక పుత్రుడని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed