- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముద్రగడ కాపు ఉద్యమ నాయకుడు కాదు.. కాపు కులద్రోహి: కిరణ్ రాయల్
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. పవన్ కల్యాణ్ వీధి రౌడీలా మాట్లాడొద్దంటూ ముద్రగడలో లేఖలో విరుచుకుపడ్డారు. దీంతో పవన్ కల్యాణ్‌పై ముద్రగడ చేసిన విమర్శలపై జనసేన కార్యకర్తలు, నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా, ముద్రగడ లేఖపై జనసేన నేత కిరణ్ రాయల్ ఘాటుగా స్పందించారు.
ముద్రగడ కాపు ఉద్యమ నాయకుడు కాదు.. కాపు కులద్రోహి అని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నిధులతో సభలు పెట్టే ముద్రగడ లేఖలు రాయడం హాస్యాస్పందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కొడుక్కి ఎమ్మెల్యే టికెట్, తనకు ఎంపీ టికెట్ కోసమే ముద్రగడ ప్రయత్నం అని ఆరోపించారు. ఒక్క లేఖతో ఏపీలో జనసేన వర్సెస్ ముద్రగడగా రాజకీయం మారింది. పవన్ కల్యాణ్‌కు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న వేళ ముద్రగడ ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడటం జనసేన కార్యకర్తలు, నేతలను మరింత ఆగ్రహనికి గురి చేసింది.
Read more: వీధి రౌడీలా మాట్లాడొద్దు.. పవన్ కల్యాణ్‌పై ముద్రగడ తీవ్ర విమర్శలు