- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ భయంతో కేసీఆర్ వీధిన పడ్డారు.. బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్రంలో హంగ్ ప్రభుత్వం రాబోతున్నదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. హంగ్ లేదు బొంగు లేదు అని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రావడం లేదనే భయంతో ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ ఈ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి..ఎప్పుడో ఏడాదికో ఐదేళ్లకోసారి బహిరంగ సభల్లో మాట్లాడే కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లో భయంతో రోడ్ షోలు చేస్తూ వీధినపడ్డారని ఎద్దేవా చేశారు.ఎండల కారణంగా కేసీఆర్ ఆగం ఆగం చేస్తుంటే ఢిల్లీ పోలీసులను పంపి బీజేపీ మరో ఆగం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు మేము కూడా అనుకూలమే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఈ వర్గాల గురించి అమిత్ షా గతంలో ఎప్పుడైనా ఇంత బహిరంగంగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఎప్పుడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారో అప్పటి నుంచి బీజేపీకి భయం పట్టుకుందని దాంతో ఆ పార్టీ నాయకులకు రాత్రి నుంచి నిద్రలేదని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు ఇంకా అవసరమా? అందరిని జనరలైజ్ చేద్దామని గతంలో అనేక సందర్భాల్లో బీజేపీ డిబేట్ చేసిందని గుర్తు చేశారు. 400 సీట్లు వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మొత్తాన్ని ఎత్తివేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఓ వాదన చేస్తోందని ఈ విషయంలో బీజేపీపై తెలంగాణలో వ్యతిరేక మొదలు కావడంతోనే బీజేపీ ఢిల్లీ పోలీసులను పంపిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ సీట్లకు దెబ్బ పడుతుందనే భయంతో వితౌట్ కంప్లయింట్ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చారన్నారు. రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ ప్రకటించారని దీంతో కొన్ని ప్రాంతాల్లో తమకు అనుకూలంగా లేకపోవడంతో ఎలాగైనా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ నోటీసులపై న్యాయపరమైన పద్ధతిలో కోర్టుల్లో తేల్చుకుంటామన్నారు.