పీసీసీ పదవి వారికిస్తే ఓకే.. కాదని రెడ్లకిస్తే నేనూ రేస్ లో ఉంటా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
పీసీసీ పదవి వారికిస్తే ఓకే.. కాదని రెడ్లకిస్తే నేనూ రేస్ లో ఉంటా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:పీసీసీ పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రతిసారి పీసీసీ పదవి అడుగుతానని ఆ పదవి అడగడం తనకు కొత్త కాదని అన్నారు. పీసీసీ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తే పర్వాలేదని కానీ వారిని కాదని రెడ్లలో ఎవరికైనా అవకాశం ఇస్తామంటే పోటీలో నేను కూడా ఉంటానన్నారు. పీసీసీ మార్పుకు ఇప్పుడే తొందరేమి లేదన్నారు. లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి కదా అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలనేది మోడీ, అమిత్ షా విధానమని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డికి విషయ అవగాహన లేదని, బీజేపీ పదవుల కోసమే ఏర్పడిన పార్టీ అని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అని ఇంకోసారి కాంగ్రెస్ అని మాట్లాడుతారని ఆయనేదో బతుకుదెరువు కోసం సర్వే సంస్థను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని పీకే చెప్పారు. కీనీ ఏం జరిగిందని సెటైర్ వేశారు. బీజేపీ బౌండరిలో ఉండి మందకృష్ణ మాట్లాడుతున్నారని తటస్థంగా ఉంటూ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తామన్నారు. బంగారు లక్ష్మణ్ ను నవ్వుల పాలు చేసినప్పుడు మందకృష్ణ కనీసం స్పందించలేదని, బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభకు పంపమని మందకృష్ణ ఎందుకు అడగలేకపోయారని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed