- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagga Reddy: బీఆర్ఎస్ పాలనలో ట్విన్ సిటీస్ వివక్షకు గురయ్యాయ్: జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ పానలో ట్విన్ సిటీస్ పూర్తిగా వివక్షకు గురయ్యాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సంక్షేమం వెల్లవిరిసేలా మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారని.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సిందిపోయి కేసీఆర్ అండ్ కో విమర్శలు గుప్పిం సరి కాదని హితవు పలికారు. పత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జంట నగరాలకు బడ్జెట్‌లో రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అని అన్నారు. మహా నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని తెలిపారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏనాడైనా హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించారా అని ప్రశ్నించారు. ఆనాడు వర్షాలతో నగరం అంతా అతలాకుతలం అయితే.. ప్రగతి భవన్‌లో కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చిన రోజులు నగరవాసులకు తెలుసని చురకలంటిచారు. మళ్లీ నేడు వర్షాలు పడితే.. ప్రజల కష్టాలపై బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. మూసీ నదిని శుభ్రం చేసి నగర ప్రజలు ఈత కొట్టేలా చేస్తానని చెప్పిన కేసీఆర్‌కు విషయం గుర్తుందో లేదోనని చమత్కరించారు. హుస్సేన్ సాగర్ జలాశయంలోని నీటిని నోట్లో పోసుకునేలా చేస్తానని శపథాలు చేసిన పెద్ద మనిషికి తమ బడ్జెట్ మీద మాట్లాడే అర్హత ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.