- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నర్సింహా రెడ్డి కమిషన్ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని అన్నారు. ప్రభుత్వ పెద్దల మాదిరిగానే కమిషన్ చైర్మన్ మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. అందుకే కేసీఆర్ తగు రితీలో సవివరంగా సమాధానం ఇచ్చారని స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖతో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయన్నారు. ఏదైనా ఒక అంశంపై విచారణ చేపట్టప్పుడు విచారణాధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూదని, కానీ ఈ కమిషన్ అందుకు భిన్నంగా ఉందని అన్నారు.
దర్యాప్తు పూర్తి కాకముందే కావాలనే మీడియాకు లీకులు ఇచ్చి కొందరితో మాట్లాడిస్తున్నారని, మరీ అదే నిజమైతే ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెల్లించిందే రూ.7 వేల కోట్లు అయితే.. అందులో రూ.6 వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందాల్లో రూ.6 వేల కోట్ల అక్రమాలు జరిగాయనేది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లతో రూ.6 వేల కోట్ల నష్టం కాదని.. తెలంగాణకు రూ.6 వేల కోట్లు లాభం జరిగిందన్నారు. నల్లగొండ జిల్లాలో థర్మల్ ప్లాంట్ పెడితే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతోందని అనాడు సమైక్య వాదులు భయపెట్టారని, కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ 24 గంటల విద్యుత్‌ను అందించారని అన్నారు.