Jagadish Reddy: ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు

by Shiva |
Jagadish Reddy: ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Former Minister Jagadish Reddy) ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రూ.4 వేల కోట్లకు తగ్గిందని అన్నారు. ఆదాయం అంతా కాంగ్రెస్ నేతల (Congress Leaders) జేబుల్లోకి వెళ్తుందని ఆయన ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) హయాంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆదాయం పెరుగుతూ వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి శాఖలో అవినీతికి ఆస్కారం లేకుండా చేశామని అందుకే అది సాధ్యం అయిందని జగదీశ్ రెడ్డి అన్నారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా.. సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు రీచ్ అవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు (Power Cuts), లో-వోల్టేజ్ (Low-Voltage) సమస్యలు పెరుగుతోన్న దాఖలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్కడా కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. పలు జిల్లాల్లో మోటార్లు కాలిపోతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయని తెలిపారు. లో-వోల్టోజీ (Low-Voltage) సమస్యతో ఇళ్లలోని విలువైన గృహోపకరణాలు (Home Appliances) దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలోని పలుచోట్ల పవర్ కట్ (Power Cut) సమస్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) సరిపడా విద్యుత్ కొనగోలు చేయడం లేదని.. డిమాండ్ తగినట్లుగా కరెంట్ సప్లయ్ (Power Supply) లేకపోవడం వల్లే లో-వోల్జేజీ (Low-Voltage) సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు. కమిషన్లు రాని పనులు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చేయగలిగామని.. చార్జీలు పెంచితే జరగబోయే పరిణామాలను ఈఆర్సీకి వివరించామని జగదీశ్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story