- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
‘సార్.. న్యాయం చేయండి’.. సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ కీలక రిక్వెస్ట్
by Satheesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: గురుకుల సంస్థ బదిలీలలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే స్పౌజ్ కింద పరిగణిస్తున్నారని, జ్యూడిషియరీ, రైల్వే, బ్యాంకులను కూడా పరిగణలోకి తీసుకోవాలని గురుకుల సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రెసిడెంట్ మామిడి నారాయణ మాట్లాడుతూ.. విద్యాశాఖ బదిలీల తరహాలోనే గురుకులాలకూ అవకాశం ఇవ్వాలన్నారు. జీవో 317 కేటాయింపులలో అన్ని స్పోజ్ కేసులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్తో పాటు పబ్లిక్ సెక్టర్లకూ ఛాన్స్ ఇవ్వాలన్నారు. అన్ని మెడికల్ కేసులను కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, కే జనార్ధన్, నరసింహులు గౌడ్, గణేష్ తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story