సెక్రటేరియట్‌లో ఆ ఐదుగురు భేటీ.. కమిటీ నియామకం తర్వాత ఫస్ట్ మీటింగ్

by GSrikanth |
సెక్రటేరియట్‌లో ఆ ఐదుగురు భేటీ.. కమిటీ నియామకం తర్వాత ఫస్ట్ మీటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధరణిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తొలిసారి సమావేశం అయింది. గురువారం సెక్రటేరియట్‌లో ఐదుగురు సభ్యుల బృందం భేటీ అయింది. ధరణిలో సవరణలు, సమస్యలపై చర్చించింది. ఈ కమిటీ ఇవ్వబోయే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ధరణి పోర్టల్‌పై నిర్ణయం తీసుకోబోతున్నది. ధరణి ప్లేస్‌లో భూమాత పోర్టల్‌ను తీసుకొస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధరణిలోని లోటుపాట్లు, సమస్యలు, పరిష్కార మార్గాలపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

కాంగ్రెస్‌ అనుబంధ కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, అడ్వకేట్‌ సునీ ల్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్‌, రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బీ మధుసూదన్‌ ఈ కమిటీలో ఉన్నారు. దీనికి సీసీఎల్‌ఏ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూఆక్రమణలు, అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ నియమించిన కమిటీ ఇవ్వబోయే రిపోర్ట్ ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠ రేపుతున్నది.

Advertisement

Next Story

Most Viewed