Tamilisai Soundararajan గవర్నర్‌గా ఉంటారో బీజేపీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలి Satyavathi Rathod

by Nagaya |   ( Updated:2022-09-08 18:16:27.0  )
Tamilisai Soundararajan గవర్నర్‌గా ఉంటారో బీజేపీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలి Satyavathi Rathod
X

దిశ, తెలంగాణ బ్యూరో : గవర్నర్ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు మహిళల పట్ల చాలా గౌరవం ఉందన్నారు. రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు దూరం ఎక్కడ పెరగలేదు.. ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయని సెటైర్ వేశారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎంతో మంది గవర్నర్లు రాష్ట్రంలో పనిచేశారని, వారితో రాని ఇబ్బంది ఈ గవర్నర్‌తో ఎందుకు వస్తుందన్నారు. బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షురాలు అని... ఇప్పుడు ఆమె అధ్యక్షురాలిగానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ పదవీకి ఆమెకు ఎలా అర్హత ఉందని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రతినిధిగా మాట్లాడం సరికాదన్నారు. కేసీఆర్ రాజ్ భవన్ కు ఎప్పుడు రావాలన్నది ఆయన ఇష్టమని తెలిపారు. వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా మీకేం పని అని వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గవర్నర్‌కు తెలియదని, అందుకే విమోచనం అంటుందని ధ్వజమెత్తారు. లేని సమస్యలను ఉన్నట్టు చూపడం సమంజసం కాదన్నారు. గవర్నర్‌గా ఏం సాధించిందో.. చేయాల్సింది ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌గా ఉంటారో పార్టీ నేతగా వ్యవహరిస్తారో తమిళిసై తేల్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ వివరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తే గవర్నర్ మాత్రం ఇలా మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. గవర్నర్ తన వైఖరి ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed