- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Vikarabad: నరేందర్ రెడ్డికి కాసేపట్లో వైద్య పరీక్షలు..!
దిశ, వెబ్ డెస్క్: అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి(Former Mla Narendar Reddy)కి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను వికారాబాద్ డీటీసీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డి(SP Narayana Reddy) ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. లగచర్ల ఘటన(Lagacharla Incident) వెనుక రాజకీయ కుట్ర ఉందన్న ఆరోపణలనపై ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత నరేందర్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
కాగా రెండు క్రితం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి జరిగింది. ఈ ఘటన బుధవారం ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ పోలీసులు హైదరాబాద్ ఫిలింనగర్‌లోని అయన ఇంటి వద్ద అరెస్ట్ చేసినట్లు ఐజి సత్యనారాయణ తెలిపారు. కలెక్టర్ బృందంపై కుట్ర పూరితంగానే దాడి చేసారనే ఆరోపణలు, దాడి ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేష్ రాజ్ వెనకాల మాజీ ఎమ్మెల్యే ఉన్నాడనే ప్రాథమిక సాంకేతిక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో దాడికి ముందు, ఆ తర్వాత సురేష్ దాదాపు 40 సార్లు ఫోన్‌లో మాట్లాడరని పోలీసులు గుర్తించారు. సురేష్ రాజ్ పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు. ఆయన దొరికిన తర్వాత విచారణలో మాజీ ఎమ్మెల్యే పాత్ర తెలనుంది. ఈ కేసులో మొత్తం 55 మందిని విచారించిన వికారాబాద్ పోలీసులు 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.