- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
BRS ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
దిశ, చైతన్య పురి : హైదరాబాద్ కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 2లో ఉన్న భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఐటీ అధికారులు ఇంట్లోకి వెళ్లి సోదాలు చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. శ్రీ లార్వేన్స్, సిండికేట్, హిల్ ల్యాండ్ టెక్నాటజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శేఖర్ రెడ్డి పలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బెంగళూరులో తన సమీప బంధువు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారాలలో శేఖర్ రెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.