- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్..!
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కిషన్ రెడ్డి గెలవగా.. మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ గెలిచారు. అయితే మరోసారి కూడా కిషన్‌రెడ్డికి ప్రధాని మోడీ కేబినెట్‌లో అవకాశం దక్కింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన బండిసంజయ్ కూడా కేబినెట్‌లో చోటు కల్పించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్‌కు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎంపీ ఈటల రాజేందర్‌కు సంకేతాలు పంపారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే అమిత్ షాను సోమవారం ఎంపీ ఈటల రాజేందర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటలతో అమిత్ షా చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. కాగా ఏపీ, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలవగా ఏపీలో ముగ్గురు విజయకేతనం ఎగురవేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బీజేపీ ఎంపీలకు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కింది.