మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు!

by Nagaya |   ( Updated:2022-11-23 14:28:16.0  )
మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన సంబంధికుల ఇళ్లలో ఐటీ తనిఖీలు చేపడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ వైస్ చైర్మన్ నిరంజన్.. మంత్రి మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లారెడ్డి కబ్జా భూముల్లోనే కాలేజీలు కట్టారని ఆరోపించారు. బహిరంగంగానే సీట్లు అమ్ముకున్నారని ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే విచారణ ఎందుకని నిలదీశారు. వ్యవస్థ వ్యవస్థ మాదిరిగా, రాజకీయాలు రాజకీయాల్లా ఉండాలని అన్నారు. తాను ఐటీ దాడులను గాని మల్లారెడ్డిని గాని వెనుకేసుకురావడం లేదని, ఎప్పటి నుంచో మల్లారెడ్డి ఓపెన్ గానే ఇవ్వన్ని చేస్తుంటే ఇప్పుటే దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేయడంపై స్పందించిన ఆయన గాంధీని చంపిన గాడ్సే పార్టీలో చేరతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శశిధర్ రెడ్డి పార్టీని వీడటం బాధకరమని బీజేపీలో చేరతాననడం కాంగ్రెస్ విధేయులకు మచ్చలాంటిదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed