‘ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టండి’

by Sathputhe Rajesh |
‘ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల కోరారు. అమెరికాలోని న్యూ జెర్సీలో ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు దూసుకెళ్తుందన్నారు. దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో అంతర్జాతీయ సంస్థలు తెలంగాణకు వచ్చాయని, దేశంలో తెలంగాణ ముందు ఉందన్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ లోటు, నీటికొరత వంటి స‌మ‌స్యల‌ను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహిస్తున్నామని, ప్లగ్ అండ్ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మిస్తున్నామన్నారు. టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. హైదరాబాద్ కాకుండా టైర్ 2 నగరాల్లో ఇప్పటికే ఐటీ హబ్‌లు ప్రారంభమయ్యాయన్నారు.

త్వరలోనే నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండలో ఐటీ హబ్‌లు ప్రారంభం కానున్నాయన్నారు. టైర్ 2 నగరాల్లో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని న్యూ జెర్సీ సెనెటర్ కోరి బుకర్ , ఐటీ సర్వ్ నేషనల్ ప్రెసిడెంట్ విజయ్ మహాజన్, నార్త్ ఈస్ట్ ప్రెసిడెంట్ కళ్యాణ్ , ప్రవీణ్ తడ్కమల్ల, ప్రవీణ్ ఎండపల్లి , మహీందర్ ముసుకు, నార్త్ ఈస్ట్ కి సంబంధించిన 250 మంది వివిధ కంపెనీల యజమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed