హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్: మంత్రి జూపల్లి

by Satheesh |   ( Updated:2024-01-09 16:11:28.0  )
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్: మంత్రి జూపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 13 నుంచి 15 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో జ‌రిగే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామన్నారు. ప్రజలందరికీ ఉచితంగా ఎంట్రీ ఉంటుందన్నారు. మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. దేశ‌, విదేశాల‌ నుంచి వ‌చ్చే అతిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘ‌న‌మైన‌ ఆతిధ్యం ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌న్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఒక ‘మినీ ఇండియా’ అని అన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కాస్మోపాలిట‌న్ సిటీలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఎన్నో మతాలకు హైదరాబాద్‌ నెలవుగా మారిందన్నారు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా అంత‌ర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్‌ను నిర్వహిస్తామన్నారు. సుమారు 15 లక్షల మంది సంద‌ర్శకులు వ‌స్తార‌ని అంచనా వేస్తున్నామ‌ని తెలిపారు. 16 దేశాల‌కు చెందిన కైట్ ప్లేయ‌ర్స్, వివిధ రాష్ట్రాల కైట్ ప్లేయ‌ర్స్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొంటార‌ని వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 400 రకాల స్వీట్లు పుడ్ కోర్టులలో లభిస్తాయన్నారు. రానున్న రోజుల్లో ఈ సెలబ్రేషన్స్‌ను గ్రామీణ ప్రాంతాలకూ తీసుకువెళ్తామన్నారు. ఈకార్యక్రమంలో యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, ప‌ర్యాట‌క శాఖ డైరెక్టర్ కె.నిఖిల‌, సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed