- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షర్మిల పార్టీలో అంతర్గత కుమ్ములాట!
దిశ, డైనమిక్ బ్యూరో: షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావుపై సొంత పార్టీ నేతలు దాడి చేశారు. ఈ రబస పార్టీ కార్యాలయం లోటస్ పాండ్ లోనే చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆ పార్టీలో సంచలనం రేపుతోంది. నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో గట్టు రామచంద్రరావు తీరుపై నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాటకు మాట పెరగడంతో ఒక్కసారిగా గట్టు రామచంద్ర రావుపైకి నేతలు దూసుకు వెళ్లారు. ఈ సందర్భంగా రామచంద్రరావుపై నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.
పార్టీలో దిగువ స్థాయి నేతలను, నియోజకవర్గం కార్యకర్తలు చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడని, కోరుకున్న పదవులు దక్కేలా చేస్తానని కింది స్థాయి నేతల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారింది. అయితే రామచంద్రరావుపై దాడి చేసిన ఘటనలో రాజేంద్రనగర్ నియోజకవర్గం యువజన విభాగం నేత కర్రే ప్రకాష్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా గతంలో టీఆర్ఎస్ లో పని చేసిన గట్టు రామచంద్రరావు గతేడాది షర్మిల సమక్షంలో వైఎస్సార్ టీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం గట్టు వ్యవహార శైలి పెద్ద తలనొప్పిగా మారింది అంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని బయలుదేరిన షర్మిల తమ పార్టీలోకి పెద్ద నేతలను ఆకర్షించడంలో విఫలం అవుతున్నారు. పార్టీలో ఎవరైనా చేరినా ఎక్కువ కాలం నిలవలేకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. గతంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి షర్మిల పార్టీలో చేరిన ఇందిరా శోభన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలను షర్మిల ఎలా హ్యాండిల్ చేస్తారనేది చర్చగా మారింది.