- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెలసరి సమయంలో హెవీ బ్లీడింగ్ అవుతుందా..? ఇలా చేయండి చాలు!
దిశ, ఫీచర్స్: నెలసరి అనేది ప్రతి నెల మహిళలకు సంభవించే ఒక సాధారణ ప్రక్రియ. ఈ సమయంలో కొందరికి అధిక రక్తస్రావం అవుతుంది. దీని వల్ల రోజువారి పనులు చేయలేనంత అలసటగా ఉంటుంది. ఇది ఎక్కువ రోజుల పాటు కొనసాగితే రక్తహీనత, శ్వాస సమస్య, అలసట వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఈ సమస్య ఎక్కువైతే వైద్యులను సంప్రదించడం మంచిది. ప్రతి నెల 28 రోజుల తరువాత నెలసరి వస్తూ ఉంటుంది. కొంతమంది మహిళలకు ముందుగానే రావడం లేదా 35 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది. అమ్మాయిలకు రుతుచక్రం ప్రారంభమైన రోజులో అధిక రక్తస్రావం ఉంటుంది. దీని కారణంగా ఒక్క రోజుకు 2 లేదా 3 ప్యాడ్‌లను మార్చాల్సి ఉంటుంది. ఇది శరీరాన్ని బలహీనపరుస్తుంది.
ఇలా ఎందుకు అవుతుంది?
గర్భసంచిలో ఫైబ్రాయిడ్లు, కణితులు వంటి సమస్యలు ఉన్న వారిలో అధిక రక్తస్రావం జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత కూడా అధిక రక్తస్రావానికి కారణం అవుతుంది. అండోత్సర్గము లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. శరీరంలో ఎక్కువగా వేడి కారణంగా అధిక రక్తస్రావం జరుగుతుంది. దీని వల్ల రక్తహీనత, ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనిని తగ్గించుకోవాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించండి.
* సోంపు నీరు తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావం అదుపులోకి వస్తుంది. సోంపును పౌడర్‌లా చేసుకొని, నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ నీటిని వడగట్టి తాగితే హెవీ బ్లీడింగ్‌ను అదుపు చేయవచ్చు.
* అధిక రక్తస్రావం అవుతుంటే పొట్ట కింతి భాగంలో ఐస్ ప్యాక్ పెట్టుకోవడం మంచిది. ఇది పొత్తి కడుపులో వచ్చే నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భాశయ కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచడం వల్ల నొప్పి తగ్గుతుంది.
* ఒక గ్లాసు నీటిలో మెంతులను వేసి, బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని గోరు వెచ్చగా తాగాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
* పీరియడ్స్ సమయంలో తగినంత నిద్ర అవసరం. నిద్ర వల్ల హార్మోన్ల స్థాయిలు నియంత్రణలోకి వచ్చి, క్రమంగా బ్లీడింగ్ తగ్గుతుంది. సరిగా నిద్ర పోవడం వల్ల అలసట, ఒత్తిడి దూరం అవుతుంది.
పీరియడ్స్ సమయంలో ప్రతి నెల అధిక రక్తస్రావం అవ్వడం శరీరంలో రక్తహీనతకు కారణం అవుతుంది. ప్రతీ నెల ఇలా జరుగుతూ, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నట్లైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.