- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Narender Reddy: కోడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడిస్తా.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కోడంగల్ (Kodangal)లో రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని ఓడిస్తానంటూ పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) సంచలన సవాల్ చేశారు. ఇవాళ పోలీసుల రిమాండ్‌లో ఆయన హైకోర్టు (High Court)కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద రైతులకు మద్దతుగా నిలిస్తే.. తనపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించారని కామెంట్ చేశారు. ఇంటెలిజెన్స్ (Intelligence), పోలీసుల వైఫల్యంతోనే లగచర్ల (Lagacharla)లో కలెక్టర్ (Collector), అధికారులపై దాడి జరిగిందని ఆరోపించారు. దాడిని పక్కదారి పట్టించేందుకే తనపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తనకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని.. నిర్దోషిగా బయటకు వస్తానని పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) తెలిపారు.
కాగా, లగచర్ల (Lagacharla) ఘటనలో తనను అరెస్ట్ చేయడం, కొడంగల్ కోర్టు (Kodangal Court) రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టు (High Court)లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash Petition)పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను 22కు వాయిదా వేసింది.