- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Secret Lovers: ఇంతకు రహస్య ప్రేమికులెవరు? బీజేపీ-బీఆర్ఎస్‌ల వాలెంటైన్స్ డే విషేస్

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికులందరికీ ఎంతో ప్రత్యేకం. ప్రపంచవ్యాప్తంగా నేడు వాలెంటైన్స్ డే (Valentines Day) నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ కాంగ్రెస్-బీజేపీ పార్టీలకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పింది. శుక్రవారం బీఆర్ఎస్ ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా (Secret Lovers) రహస్య ప్రేమికులుగా ఉంటూ వస్తున్న బీజేపీ- కాంగ్రెస్‌లకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. కాంగ్రెస్ (Congress) పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకపోయినా.. కాంగ్రెస్‌ను బీజేపీ ప్రశ్నించదని ఆరోపించింది. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా బీజేపీని కాంగ్రెస్ నిలదీయదని ఆరోపించింది.
తెలంగాణ బీజేపీ (Telangana BJP) పార్టీ కూడా తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా ‘రహస్య ప్రేమికులకి, వాలెంటైన్స్ - డే శుభాకాంక్షలు’ అంటూ విషెస్ తెలిపింది. కాంగ్రెస్-బీఆర్ఎస్‌లను విమర్శిస్తూ.. ప్రజలు చూసేటప్పుడు కొట్లాడుతారని, ప్రజలు చూడనప్పుడు కలిసి ఉంటారని ఓ వీడియో బీజేపీ పోస్ట్ చేసింది. మరో బీఆర్ఎస్ శ్రేణులు సైతం కాంగ్రెస్, బీజేపీలకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట వీడియోలను పోస్ట్ చేస్తున్నాయి. ఇక, బీఆర్ఎస్, బీజేపీలు రహస్య మిత్రులని కాంగ్రస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ వాలెంటైన్స్ డేలో ఇంతకు ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య అసలైన రహస్య ప్రేమికులు ఎవరని పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.