- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ఆటోలో ప్రయాణించడానికి అసలు కారణం అదేనా.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. శనివారం యూసూఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లి నగర ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తమ పార్టీ తరపున కృషి చేస్తామని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అసెంబ్లీలో నిలదీస్తామని భరోసా ఇచ్చారు. అయితే, కేటీఆర్ ఆటో ప్రయాణంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండోరోజే రెండు గ్యారంటీలు అమలు చేసిన విషయం తెలిసిందే. అందులో కీలకమైనది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. దీంతో మహిళలకు మేలు చేయాలన్న కుట్రతో కాంగ్రెస్ సర్కార్ ఆటో కార్మికుల కడుపు కొడుతోందని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే కేటీఆర్ ఆటోలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెట్టింట్లో ఇరు పార్టీల నేతల మధ్య ‘సోషల్ వార్’ నడుస్తోంది.