Inter Board: విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేయండి

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-30 17:00:18.0  )
Inter Board: విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ సిలబస్‌ను సకాలంలో పూర్తి చేసి, పరీక్షలకు స్టూడెంట్లను సిద్ధం చేయాలని ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కాలేజీల బలోపేతానికి సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. శనివారం బంజారాహిల్స్‌లోని సేవాలాల్ భవన్‌లో డీఐఈఓలు, కాలేజీ ప్రిన్సిపల్స్, ఇంటర్ బోర్డు అధికారులతో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. కాలేజీల గుర్తింపు, సీసీ కెమెరాల ఏర్పాటు, ల్యాబుల్లో సౌకర్యాలు, కాంపౌడ్ వాల్స్ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసి చర్యలు తీసుకుందామన్నారు. టెలీ మానస్ టోల్ ఫ్రీనెంబర్ 14416 కు కాల్ చేస్తే సైకాలజిస్టులు వారికి కౌన్సెలింగ్ ఇస్తారని వెల్లడించారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నివారణకు సహకరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed