- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో స్ట్రెస్, భయాందోళనలు తొలగించేందుకు ‘టెలీ మానస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 14416 అనే నంబర్ కు ఫోన్ చేసి విద్యార్థులు తమ ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను నియమించింది. పరీక్షలు, ఫలితాల విషయంలో విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావద్దని సూచిస్తోంది.
ఇంటర్ విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు టెలీ మానస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బోర్డు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులు ఎవరైనా ఒత్తిడికి గురైనట్లుగా అనిపిస్తే టెలీ మానస్ కు కాల్ చేసి నిపుణులతో కౌన్సెలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇంటర్ విద్యార్థులు, పేరెంట్స్‌కి ఉచితంగా సైకాలజిస్ట్ కన్సల్టేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు బోర్డు స్పష్టంచేసింది.