వారం తర్వాతే విచారణ.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీం షాక్

by Sathputhe Rajesh |
వారం తర్వాతే విచారణ.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీం షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్‌పై తెలంగాణ సీఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి వారం రోజుల హొలీ సెలవుల తర్వాత పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. గురువారం గవర్నర్‌ తమిళిసైపై వేసిన పిటిషన్‌పై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో నేడు ప్రస్తావించలేదు. అయితే, ఈ నెల 4వ తేదీ నుండి 11 వరకు సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ప్రకటించారు. హోలీ సెలవుల తరువాతే తిరిగి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి.

ఇక రేపటి నుండి సుప్రీంకోర్టుకు హొలీ సెలవులు ఉండటంతో వారం రోజుల తర్వాతే తెలంగాణ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ అడ్డుకుంటున్నారని, వాటిని ఆమోదించడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట గురువారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఇందులో గవర్నర్​ సెక్రటరీ, కేంద్ర లా సెక్రటరీని ప్రతివాదులుగా చేర్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 32 ప్రకారం పిటిషన్‌ను ఫైల్​ చేస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed