- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rajanna Sircilla: కొడుకు పనికి రావట్లేదని.. తల్లిని తీసుకెళ్లిన అగంతకులు
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) మండలం కోడిముంజలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కోడిముంజ(Kodimunja)కు చెందిన శ్రీనివాస్ అనే మేస్త్రీ మహారాష్ట్రలో చెరుకు తోట కోసేందుకు రూ.3 లక్షలతో ఒప్పందం చేసుకున్నాడు. ఒకట్రెండు రోజులు పనిచేసి ఇంటికి వచ్చాడు. తిరిగి మళ్లీ పనికి వెళ్లకపోవడంతో కొందరు అగంతకులు శ్రీనివాస్ తల్లి భీమాబాయి(Bhimabai)ని మహారాష్ట్ర(Maharashtra)కు తీసుకెళ్లారు. పనికి రాలేకపోతే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని వారు అనేకసార్లు ఫోన్ చేసినట్లు సమాచారం. వారి ఫోన్లు శ్రీనివాస్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆగ్రహానికి గురై తన తల్లిని తీసుకెళ్లినట్లు సదరు మహారాష్ట్ర(Maharashtra) వాసులు చెబుతున్నారు. భీమాబాయి మనవడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పోలీసులు మహారాష్ట్రకు వెళ్లి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.