ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్లు.. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

by Prasad Jukanti |   ( Updated:2024-08-03 07:36:22.0  )
ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్లు.. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరు లోపే మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రతి గ్రామంలో అర్హులైన వారందరు ఇళ్లు నిర్మించుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం కూడా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నదని స్పష్టం చేశారు. శనివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. గాంధీ నగర్ క్రాస్ మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఏ వేదికపైకి ఎక్కినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మాయమాటలు చెప్పారని, తన సొంత నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్లను పేపర్లలో ఫోటోలు వేయించుకుని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు అడిగారని ధ్వజమెత్తారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1 లక్షల 50 వేల ఇళ్లు మాత్రమే నిర్మిస్తే నేడు ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతలోనే 4 లక్షల 50 వేలు ఇళ్లు నిర్మించబోతున్నదని చెప్పారు.

సాగు భూములకు పట్టాలు:

రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ఈ ప్రభుత్వం పేదల కోసం కృషి చేస్తున్నదన్నారు. సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థికంగా ఎంత భారమైనా రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు. గతం ప్రభుత్వం 7 లక్షల 20 వేల కోట్లు అప్పులు చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం పట్టుపట్టి రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని ఈ నెలాఖరు వరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతులకు అవసరమైన పనిముట్లలో ఇవ్వాల్సిన రాయితీలను బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుగా చేసేందుకు రైతు రుణమాఫీతో పాటు రైతుభరోసా, వ్యవసాయ పనిముట్లపై రాయితీ, పంట ఇన్సురెన్సు, విత్తనాలపై రాయితీలు ఇస్తున్నదన్నారు.

Advertisement

Next Story

Most Viewed