- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సిగ్గనిపించడం లేదా..? సీఎంపై ఇందిరా శోభన్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై ఇందిరా శోభన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులను రాజు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలనలో రైతులను నిత్యం పాడెకు పంపుతున్నాడని ధ్వజమెత్తారు. ఇలా చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్‌లో పడుకుని రైతులు రాజైనట్టు కలగంటున్నారా అని ప్రశ్నించారు. శనివారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ఇందిరా శోభన్.. రైతుల ఆత్మహత్యల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని సీఎం అంటున్నారు. కానీ ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన సమాచారం ప్రకారం 2017 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 3055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రినే స్వయంగా పార్లమెంట్‌లో వెల్లడించారని అన్నారు.
రాజకీయాల కోసం రైతుల ఆత్మహత్యలపై అబద్దాలు చెబుతున్న ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయకుండా, ఉచిత ఎరువులు, సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా, పండిన పంటలను సమయానికి కొనుగోలు చేయకుండా ఒక వేళ కొనుగోలు చేసినా వాటికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌కు ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయడం, దాడులు చేయడం, బెదిరించడం మాత్రమే తెలుసని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలు మేలుకోవాలని ఆత్మగౌరవం కాపాడుకుందామని, తెచ్చుకున్న తెలంగాణ అబాసు పాలు కాకుండా పోరాడుదామని సూచించారు.