Visa Lottery :హెచ్1బీ- వీసా రిగ్గింగ్ స్కాంలో కంది శ్రీనివాస్ రెడ్డి ?!

by Hajipasha |   ( Updated:2024-08-01 19:24:23.0  )
Visa Lottery :హెచ్1బీ- వీసా రిగ్గింగ్ స్కాంలో కంది శ్రీనివాస్ రెడ్డి ?!
X

దిశ, నేషనల్ బ్యూరో : హెచ్1-బీ వీసా స్కాంలో ఇండియన్-అమెరికన్ వ్యాపారవేత్త, తెలంగాణకు చెందిన కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారంటూ ‘బ్లూమ్‌బర్గ్’ ఓ సంచలన నివేదికను ప్రచురించింది.ఆయన ఒకే అభ్యర్థి కోసం దాదాపు 30 సార్లు హెచ్1-బీ వీసాకు దరఖాస్తు చేసినట్లు ఆ నివేదికలో ఆరోపించారు. హెచ్1-బీ వీసాల రిగ్గింగ్‌కు పాల్పడిన ప్రధాన నిందితుల్లో కంది శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారని పేర్కొన్నారు. బ్లూమ్‌‌బర్గ్ నివేదిక ప్రకారం.. హెచ్1-బీ అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. దీని ద్వారా అమెరికా కంపెనీలు ప్రత్యేకమైన ఉద్యోగాలలో విదేశీయులను నియమించుకోవచ్చు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాల కోసం లాటరీని నిర్వహిస్తుంది. ఈక్రమంలో అదనపు లాటరీ టిక్కెట్లను పొందడం ద్వారా చాలా కంపెనీలు అక్రమ ప్రయోజనం పొందాయని కొత్త ఫెడరల్ డేటా వెల్లడించింది. అయితే కొన్ని కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగం చేసినట్లు తాజా వ్యవహారంతో వెలుగుచూసిందని బ్లూమ్ బర్గ్ తెలిపింది. వీసాల జారీ విషయంలో తమ కంపెనీ ఎలాంటి తప్పు చేయలేదని కంది శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాది లూాస్ గ్యారిట్సన్ స్పష్టం చేశారు. తమ కంపెనీలు తప్పు చేశాయి అనేందుకు ఆధారాలు లేవని తేల్చిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed