ఇండియా టుడే సర్వే: బీఆర్ఎస్, బీజేపీలకు సిట్టింగ్ స్థానాలు గల్లంతు

by Prasad Jukanti |
ఇండియా టుడే సర్వే: బీఆర్ఎస్, బీజేపీలకు సిట్టింగ్ స్థానాలు గల్లంతు
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియా టుడే విడుదల చేసిన మూడ్ ఆప్ ది నేషన్ ఒపీనియన్ పోల్ లో సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోయింది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు గాను ఈసారి కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలవబోతున్నదని తేలింది.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీకి భారీ షాక్ తప్పదని ఈ సర్వే తేల్చింది. ఈసారి బీఆర్ఎస్, బీజేపీ చెరో3 స్థానాలకే పరిమితం కాబోతున్నదని ఈ సర్వే ఫలితాలు తేల్చాయి. ఇక ఎంఐఎం ఎప్పటిలానే ఒక స్థానంలో సత్తా చాటుతుందని తెలిపింది.

బీఆర్ఎస్, బీజేపీ సిట్టింగ్ సీట్లు గయాబ్:

ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల సిట్టింగ్ లు ఓడిపోవడం ఖాయం అని ఈ సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుని మిగతా పార్టీల కంటే లీడ్ లో ఉండగా ఈసారి మాత్రం ఆరు స్థానాలను కోల్పోయి కేవలం 3 స్థానాలకే పరిమితం కాబోతున్నదని ఈ సర్వే తేల్చింది. ఇక బీజేపీ గత ఎన్నికల్లో మొత్తం 4 స్థానాల్లో విజయం సాధించగా ఈసారి ఒక స్థానాన్ని కోల్పోయి 3 చోట్ల గెలుస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 7 స్థానాల్లో మెరుగు పడి మొత్తం 10 సీట్లు తమ ఖాతాలో వేసుకోబోతున్నట్లు ఈ సర్వే తెలిపింది.

Advertisement

Next Story