భారత్‌ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
భారత్‌ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : టాటా గ్రూప్స్‌ సంస్థల గౌరవ చైర్మన్‌ రతన టాటా మరణంతో దేశం ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. రతన్‌ టాటా దయగల అసాధారణ, దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని కొనియాడారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని, ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారని, మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారన్నారు. తమదైన దృష్టితో ప్రపంచంపై ముద్రవేసిన కొందరు వ్యక్తుల్లో రతన్‌ టాటా ఒకరని, వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, దాతృత్వశీలిగా జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

రతన్ టాటా మృతితో నిజమైన మానవతావాదిని కోల్పోయమని, వారు చేసిన సహాయం సేవ ఈ దేశానికి ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రాలకి చిరస్మరణీయమన్నారు. రతన్‌ టాటాను అభిమానించేవారికి, టాటా గ్రూప్‌ సంస్థల వారికీ కోమటిరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Next Story