ప్రభుత్వ వర్శిటీల్లో పెంచిన పరీక్ష ఫీజులు తగ్గించాలి : ఎస్ఎఫ్ఐ

by Sumithra |   ( Updated:2023-04-12 14:50:26.0  )
ప్రభుత్వ వర్శిటీల్లో పెంచిన పరీక్ష ఫీజులు తగ్గించాలి : ఎస్ఎఫ్ఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాకతీయ, శాతవాహన, ఉస్మానియా, పాలమూరు, జేఎన్టీయూహెచ్, తదితర యూనివర్శీటీల పరిధిలో పెంచిన పరీక్ష ఫీజులు, నాన్ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజులు, ప్రస్తుతం రాస్తున్న సెమిస్టర్ ఫీజులను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్ మూర్తి, టీ. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్శీటీలకి అదనపు ఆదాయం కోసం ప్రైవేటు విద్యాసంస్థల కంటే దారుణంగా ప్రభుత్వ యూనివర్శిటీలు ఫీజులు పెంచుతున్నాయని పేర్కొన్నారు. సెమిస్టర్ ఫీజులు ఒక్కోసారి ఒక్కోలా పెంచుతూ ఫీజుల భారాన్ని విద్యార్ధులపై రుద్దుతున్నారని వివరించారు.

కేయూ, ఓయూలో ఈ సంవత్సరం భారీగా ఫీజులు పెంచారని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మూలంగానే విద్యార్థులపై భారం మోపుతున్నారని విమర్శించారు. ట్యూషన్ ఫీజులు కూడా పెంచి ప్రభుత్వం ఇవ్వకుంటే ఆయా ఫీజులు కూడా విద్యార్ధులపై మోపుతున్నారని పేర్కొన్నారు. కేయూ ఇటీవల నాన్ సెమిస్టర్ బ్యాక్ లాక్ పరీక్షలు ఫీజులు ద్వారా 67 కోట్లు వసూళ్లు చేసిందన్నారు. ఓయూ కూడా ఇలాగే వసూళ్లు చేసిందని విమర్శించారు. యూనివర్శిటీల్లో పెంచిన అన్ని రకాల ఫీజులు తక్షణమే తగ్గించాలని, లేకపోతే యూనివర్సిటీల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Also Read..

గూగుల్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్..

Advertisement

Next Story

Most Viewed