మునుగోడు ఎఫెక్ట్: వనస్థలిపురంలో వాళ్లకు టీఆర్ఎస్ విందు!

by GSrikanth |
మునుగోడు ఎఫెక్ట్: వనస్థలిపురంలో వాళ్లకు టీఆర్ఎస్ విందు!
X

దిశ‌, వ‌న‌స్థలిపురం: మునుగోడు ఉప ఎన్నికతో ప‌లు పార్టీలు ఓట‌ర్లను లోబ‌రుచుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక‌డుగు ముందుకేసి మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల‌కు చెందిన తండావాసుల‌కు ఆత్మీయ స‌మ్మేళ‌నం పేరుతో విందు ఏర్పాటు చేయ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. తండావాసుల‌ను లోబ‌ర్చుకోవ‌డానికి వ‌న‌స్థలిపురంలోని బొమ్మిడి ల‌లితా గార్డెన్‌లో ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఆత్మయ స‌మ్మేళ‌నం విందులో మంత్రి స‌త్యవ‌తి రాథోడ్ పాల్గొని వారికి ప‌లు హామీలు గుప్పించారు. గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ ప్రక‌టించిన‌ ఘ‌న‌త టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని చెప్పారు. తండాల‌ను గ్రామ‌పంచాయితీలు ఏర్పాటు చేసిన కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రిచి, కారు గుర్తుపై ఓటేయాల‌ని అభ్యర్థించారు. త్వర‌లోనే ప్రభుత్వం గిరిజ‌న బంధు కూడా ప్రక‌టిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఈ విందులో మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రాధాన‌గ‌ర్ తండా, సీత్యతండా, పొర్లగ‌డ్డ తండా, మ‌రిబావి తండాల‌కు చెందిన గిరిజ‌ను హాజ‌ర‌య్యారు.

Advertisement

Next Story

Most Viewed