- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BANDI SANJAY: పార్టీలో నేను ఆటుపోట్లకు గురయ్యా.. అవమానాలను భరించా: బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో తాను కూడా ఆటుపోట్లకు గురయ్యానని, అవమానాలకు భరించానని జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ఆయన మాట్లాడుతూ.. నిత్యం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే తాను ముందుండి వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పని చేయకపోతే తల్లికి ద్రోహం చేసినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్టీలో తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని, తన వల్లే పార్టీ ఉందని ఎప్పుడు చెప్పలేదని అన్నారు. గతంలో బీజేపీలో తాను కూడా ఎన్నో అవమానాలకు గురయ్యానని ఎమోషనల్ అయ్యారు. పార్టీ నుంచి పోటీ చేసిన చాలామంది ఇప్పటికే పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓట్లు వేస్తే.. మోరీలో వేసినట్లేనని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేసి తమకు కేంద్రంలో మరింత బలం ఇవ్వాలని కోరారు.