కేసీఆర్ పాలనలో అవినీతికి కాదేది అనర్హం!.. బీఆర్ఎస్ పై టీ కాంగ్రెస్ విమర్శలు

by Ramesh Goud |   ( Updated:2024-06-30 08:20:40.0  )
కేసీఆర్ పాలనలో అవినీతికి కాదేది అనర్హం!.. బీఆర్ఎస్ పై టీ కాంగ్రెస్ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మరో దారుణం బయటపడిందని, కేసీఆర్ పాలనలో అవినీతికి కాదేదీ అనర్హం అని బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేసింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యయం పెరగడంపై స్పందిస్తూ.. అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? అని ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేసింది. ఇందులో.. కేసీఆర్ పాలనలో అవినీతికి కాదేదీ అనర్హం. పేదల కోసం కట్టే ఆసుపత్రైనా.. అమరుల కోసం కట్టే స్థూపమైనా, కమీషన్లకు కాదేదీ అనర్హం అని సంచలన ఆరోపణలు చేసింది. ఎలాంటి పత్రం లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా, మౌకిక ఆదేశాలతో.. ఇట్ల చెప్పారని, అట్ల ఏకంగా రూ.626 కోట్లు అంచనాలు పెంచేశారని మండిపడింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి గారి వరంగల్ పర్యటన సందర్భంగా ఈ దారుణం బట్టబయలైందని, ఈ వ్యవహారం పై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ తెలియజేసింది.


కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సబితమ్మ!

Advertisement

Next Story

Most Viewed