- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైన్స్ నిల్.. బెల్ట్ ఫుల్
బెల్ట్ షాపులకు తరలుతున్న కింగ్ ఫిషర్ బీర్లు
వైన్స్ షాపులలో నో స్టాక్
ఎక్కువ ధరకు బ్రాండ్ల అమ్మకం
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వైన్స్ నిర్వాహకులు
పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
దిశ, కామారెడ్డి : పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. మరో వైపు చిల్ కు చిల్లు పడుతోంది. సమ్మర్ హీట్ ను బ్రేక్ చేసే వా కూల్ కూల్ బీర్లతో చిల్ అవుదామనుకునే మందు బాబుల ఆశలకు కృత్రిమ కొరత తూట్లు పొడుస్తోంది. నో స్టాక్ బోర్డులతో మందుబాబులు ఊసురుమంటున్నారు. జిల్లాలో మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కిరాణ షాపుల్లోనే నిత్యవసర సరుకుల మాదిరిగా మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. అధికారులు మాత్రం బెల్టుషాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదు వరకు మద్యం బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. వైన్స్ షాపు లోపల కింగ్ ఫిషర్ బీర్లు ఉన్నా లేవని చెప్పడంతో పాటు అత్యధిక ధరలున్న ఇతర బ్రాండ్ బీర్లు మద్యం ప్రియులకు అంటగడుతున్నారు. క్యాష్ చేసుకునేందుకు స్టాక్ లేదని చెప్తూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
జిల్లాలో ఉన్న దాదాపు అన్ని వైన్ షాపులలో కింగ్ ఫిషర్ బీర్ల కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్నారు వైన్స్ నిర్వాహకులు. వైన్స్ కు బీర్ల స్టాక్ రాగానే వెంటనే గ్రామాల్లో దొంగ చాటుగా నిర్వహిస్తున్న బెల్టు షాపులకు బీర్లను తరలిస్తున్నారు. దాంతో వైన్ షాపుల్లో దొరకని కింగ్ ఫిషర్ బీర్లు బెల్టు షాపుల్లో మాత్రం కోకొల్లలుగా లభిస్తున్నాయి. వైన్ షాపుల్లో అడిగితే మాత్రం స్టాక్ రావడం లేదని చెప్తూ మద్యం ప్రియులను మోసగిస్తున్నారు. ఖరీదైన బ్రాండ్ల అమ్మకానికి మొగ్గు చూపుతూ మద్యం ప్రియులను మోసం చేస్తున్నారు. వైన్ షాపులో లైట్ బీర్ 150 రూపాయలు, స్ట్రాంగ్ బీర్ 170 రూపాయలు ఉండగా గ్రామాల్లో చాటుగా నిర్వహిస్తున్న బెల్టు షాపుల్లో ఒక్కొక్క బీర్ పై 10 నుంచి 20 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. డబ్బులెక్కువైనా తమకు నచ్చిన బ్రాండ్ బీర్లను బెల్టు షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు మందుబాబులు.
ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం
వైన్ షాపుల్లో స్టాక్ ఉండాల్సిన కింగ్ ఫిషర్ బీర్లు బెల్టు షాపుల్లో లభిస్తున్న విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్ నిర్వాహకులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నా నిమ్మకుండి పోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైన్ షాపులో లేని బీర్లు గ్రామాల్లో ఉన్న బెల్టు షాపుల్లో ఎలా లభిస్తున్నాయని మద్యం ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఏ బ్రాండ్ మద్యం అయినా ముందుగా రావాల్సింది వైన్ షాపులకే. వైన్ షాపుల నుంచే బెల్టు షాపులకు సరఫరా అవుతాయన్నది జగమెరిగిన రహస్యం. అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనక అంతర్యమేమిటని మందు బాబులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా బెల్టు షాపుల్లో కాకుండా వైన్ షాపుల్లో బీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తోసుకోవాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులపై ఉంది. వైన్ షాపుల్లో దొరకని కింగ్ ఫిషర్ బీర్లు బెల్టు షాపుల్లో దొరుకుతున్న వైనంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.