- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ దమ్ముంటే ఆ పని చేయు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో:కాళేశ్వరం ప్రాజెక్టు చర్చకు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ కృష్ణాజలాల అంశాన్ని తెరపైకి తేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన పాపం బీఆర్ఎస్ దేనన్నారు. కేంద్రం ప్రాజెక్టులు తీసుకుంటుంటే నల్గొండలో సభ పెట్టడం ఏంటని, దమ్ముంటే ప్రాజెక్టులపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేయాలన్నారు. గవర్నర్ స్పీచ్ పై ధన్యవాద తీర్మానంపై ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. తెలంగాణ హక్కుల కోసం మేము కొట్లాడుతుంటే బీఆర్ఎస్ కాళ్ల కింద కట్టె పెడుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణానది జలాలు కేంద్రానికి అప్పగించింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. మీ కళ్లముందే చంద్రబాబు ముచ్చుమర్రి కట్టడం, వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారని అన్నారు. జగన్ ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు కేసీఆర్ డైనిగ్ టేబుల్ మీదే జీవో నెంబర్ 203 తయారైందన్నారు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని వారికి అలుసు ఇవ్వడం ద్వారానే తెలంగాణ నీళ్లను దోచుకుపోతున్నారని ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ తెలంగాణ భూభాగంలో ఉందని ఇంటిదొంగ సహకారం లేకుంటే ఇదంతా జరిగేదా? అని ప్రశ్నించారు. ఎపీ మంత్రి రోజాగారిట్లో పులుసు తిని వీరు అలుసు ఇచ్చారని దాంతో ఏపీ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోయారని అన్నారు. 80 వేల పుస్తకాలను చదివి అన్ని తానై కేసీఆర్ కట్టిన మేడిగడ్డ మేడిపండు అయిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ గైర్హాజరు అవ్వడంపై సీరియస్:
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు కావడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వ్యక్తులకు, కుటుంబాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని, మీలో మార్పు రావాలనే ప్రతిపక్ష హోదా కట్టబెడితే దురదృష్టవశాత్తు గవర్నర్ ప్రసంగం రోజు, ఆ ప్రసంగంపై చర్చ జరుగుతున్న నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాలేదని విమర్శించారు. సుదీర్ఘమైన రాజకీయ, పరిపాలన అనుభవంతో పాటు తాను 80 వేల పుస్తకాలు చదివిన మేధావిని అని చెప్పుకునే కేసీఆర్ సభకు రాకపోవడం పై ఆక్షేపించారు. ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉంచి కేసీఆర్ సభకు గైర్హాజరు కాకపోవడం ఈ సభకు శోభతీసుకురాదన్నారు. భవిష్యత్ లోనైనా కేసీఆర్ సభకు వస్తారని ఆశిస్తున్నామన్నారు.
ప్రజలు ఇబ్బందులు పడాలని బీఆర్ఎస్ ఆశిస్తోంది:
ప్రభుత్వం దివాళా తీసి ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండు అని ప్రతిపక్షం భావిస్తోందని అందుకే తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలో కాకముందే ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వ లేదు, దివాళా తీసిందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగపడదన్నారు. రైతుబంధు పడలేదని విమర్శిస్తున్నారని వారి హయాంలో 2018-19లో రైతు బంధు వేయడానికి 5 నెలల సమయం తీసుకున్నారు. 2020-21లో రైతు బంధు వేయడానికి నాలుగు నెలలు పట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈ నెల 85 శాతం వృద్ధాప్య పెన్షన్ లు లబ్ధిదారుల ఖాతాలో జమచేశామని మిగతా 25 శాతం పెన్షన్లు ఈనెల 15 తారీఖు వరకు ఖాతాల్లో వేస్తామన్నారు. గతంలో రెండు నెలలుగా ఆలస్యంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు.
ప్రజాభిప్రాయం మేరకే మార్కులు:
గత ప్రభుత్వం నాటి లోపాలను సరిదిద్దుతుంటే వాటిని బీఆర్ఎస్ అభినందిస్తారని భావించామని కానీ బీఆర్ఎస్ సభ్యులు వారి నాయకుడి మెప్పు కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల అభిప్రాయం మేరకే వాహనాలపై టీజీ, తెలంగాణ చిహ్నంలో మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, జయజయహే తెలంగాణ గీతం వంటి నిర్ణయాలను తీసుకున్నామన్నారు. ఉద్యమ సమయంలో వాహనాలతో పాటు యువకులు తమ రక్తంతో గొడలపై టీజీ అని రాసుకున్నారని మరికొందరు గుండెలపై టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వారి రాజకీయ లబ్ధికోసం టీఎస్ గా పెట్టారన్నారని ఆరోపించారు.
రాచరిక పోకడలు ఆనవాళ్లు ఉండకూడదన్నది మా విధానం అని అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నం కూడా మారుస్తున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదన్నారు. మేం ఏర్పాటు చేయబోయే విగ్రహం అసలు సిసలు తల్లిలా ఉంటుందన్నారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతామన్నారు. గద్దర్ ను చరిత్ర పుటల్లో లేకుండా చేయాలని బీఆర్ఎస్ చూసిందని తాము అదే గద్దర్ పేరుతో ప్రతియేటా కళాకారులను గౌరవించుకోబోతున్నామన్నారు. మైనార్టీలకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే బీఆర్ఎస్ అడ్డుకుందన్నారు.
గ్రూపు-1 అభ్యర్థుల వయో పరిమితి పెంపు:
బీఆర్ఎస్ చేతగాని తనం వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని సీఎం విమర్శించారు. గత పాలకుల చర్యల కారణంగా అభ్యర్థుల వయోపరిమితి దాటిపోయిందని అలాంటి వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి అదనపు పోస్టులతో త్వరలోనే గ్రూప్-1 నిర్వహిస్తామన్నారు. నలుగురి ఉద్యోగాలు పోయాయని బీఆర్ఎస్ నాయకులు దుఃఖంలో ఉన్నారని సెటైర్ వేశారు. ఉద్యోగాల భర్తీకి ఓ విధానం ఉంటుందన్నారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యం అయిందన్నారు. గత ప్రభుత్వంలో జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లని సెటైర్లు వేశారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు జరపలేదన్నారు. అదే బీఆర్ఎస్ నేతలకు మాత్రం రెన్యూవల్ చేసుకున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే నర్స్ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశామన్నారు. 15 రోజుల్లో 15 వేల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు.
కేటీఆర్ ఓ జూనియర్ ఆర్టిస్ట్:
బీఆర్ఎస్ లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడని పోరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆ ఆర్టిస్ట్ ఆటోలో కెమెరాలు పెట్టుకుని ఆటోరాముడు డ్రామాలు చేశాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కిరాయి ఎల్తలేదని, సంసారం నడుస్తలేదని ఆటోగలబెట్టుకుంటారా ఇది వారికి మరింత ఆర్థిక నష్టమే కదా అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ విమర్శిస్తోందన్నారు. వారి ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే ఆ పార్టీ నేతలు కనీసం అడగలేదని దుయ్యబట్టారు. ఫ్రీ బస్సు పథకం ద్వారా దేవాదాయ శాఖకు క్రమంగా ఆదాయం పెరుగుతోందని గణాంకాలతో సహా వివరించారు. సీఎం స్థానంలో ఓ రైతు బిడ్డ కూర్చోవడం బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నదన్నారు. ఇక్కడి వారెవరూ ఆశామాషీగా ఇక్కడికి రాలేదని ఎవరి మాదిరిగానో మేనేజ్ మెంట్ కోటాలోనో ఉద్యమం ముసుగులోనో రాలేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ భయం వద్దు:
ప్రజా సమస్యలను శాసనసభ్యులు తీసుకువస్తే పార్టీలకు అతీతంగా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయంలో నేను నా అధికారులు అందుబాటులో ఉంటామన్నారు. ఎవరిని కలవకుండా వివక్ష చూపబోమన్నారు. మీరు వచ్చి నన్ను కలవడం ద్వారా అనవసరపు ప్రచారం కల్పించే దురుద్దేశం తమకు లేదని బీఆర్ఎస్ లోని 39 మందిలో ఎవరైనా ఎప్పుడైనా వచ్చిన నన్నుకలవొచ్చు అన్నారు. 9 ఏళ్లుగా జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి నిర్మించుకునేందుకు అందరి సహకారాన్ని ఆశిస్తున్నాన్నాని సీఎం ఈ సందర్భంగా కోరారు.