- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకేం తక్కువ .. పీసీసీ అధ్యక్షుడిని అవుతానేమో : అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండంతో ప్రస్తుతం ఆ పదవి మరొకరికి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిగా కొందరి నాయకల పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఈ జాబితాలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్‌కు టీపీసీసీ కట్టబెట్టనున్నారనే ప్రచారం జరిగినా.. అతడికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్స అభ్యర్థిగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీగా అవకాశం ఉండేదని.. కానీ ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చారని తెలిపారు. వారితో పాటు మరికొందరికి కూడా ఆలోచన ఉందని, అయితే ఈ సారి తనకు ప్రభుత్వం పదవులు అవసరం లేదని, పార్టీ బాధ్యతలే చూసుకుంటానంటే తనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే చాన్స్ ఉందని అన్నారు.