- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం అయితే ఇందిరమ్మ రాజ్యం తెస్తా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దిశ, తెలంగాణ బ్యూరో: తాను సీఎం అయితే ఇందిరమ్మ రాజ్యం తెస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం పదవి దక్కితే దాన్ని హోదాగా భావించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఎం పదవికి తానేం తక్కువ కాదని, అన్ని రకాల అర్హత ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. అయితే ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సీఎం అభ్యర్ధిని ప్రకటించలేదని, భవిష్యత్లోనూ అది జరగదని చెప్పారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఇక పార్టీ ఇచ్చిన టాస్క్ను సమర్థవంతంగా పూర్తి చేస్తున్నానని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్అధికారంలోకి వస్తే దళితులే ముఖ్యమంత్రి అని ఆ పార్టీ కాంగ్రెస్ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలకు, భట్టి తాజా స్పీచ్బలాన్ని చేకూర్చినట్లు అయింది.