- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తూచ్.. నేను అలా అనలేదు.. 'Kristu' వ్యాఖ్యలపై హెల్త్ డైరెక్టర్ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : తాను మతాలను, వ్యక్తుల నమ్మకాలను కించపరిచే వ్యక్తిని కాదని, అన్ని మతాలను ఒకే రకంగా చూస్తానని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సర్వమతాల సారం ఒక్కటే అని బలంగా నమ్ముతానన్నారు. కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో డీహెచ్చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేగడంతో ఆయన ప్రెస్నోట్ రిలీజ్చేశారు. కొన్ని మీడియా సంస్థలు తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి, వివాదాన్ని సృష్టించడం నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. కేవలం క్రీస్తు ద్వారానే కరోనా సమసిపోయిందని తాను అన్నట్టు అర్థం వచ్చేలా తన వీడియో క్లిప్ కట్ చేసి ప్లే చేయడం బాధకరమన్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. యూట్యూబ్‌లో ఉన్న ఫుల్ వీడియో చూస్తే తాను మాట్లాడిన విషయాలు స్పష్టంగా ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ఆదేశాలతో ఆరోగ్య శాఖలోని పై స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల సంపూర్ణ సహకారంతో పాటు అన్ని మతాలకు చెందిన వారు దేవతామూర్తులను ప్రార్థించటం వలనే కరోనా సమసిపోయిందని మాత్రమే తాను మాట్లాడినట్లు డీహెచ్క్లారిటీ ఇచ్చారు.
READ MORE : టీడీపీలో చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్