- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ముసలోడిని అయిపోయా.. KTR ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ముసలోడిని అయిపోయా...47 ఏళ్ళు వచ్చాయి. జుట్టుకు రంగు వేసుకున్నానని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాదులోని బంజారా భవన్లో ఏర్పాటుచేసిన సీఎంఎస్‌టిఈఐ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇండియాలో కులాలు, మతాలు అని సమాజాన్ని మనుషులే భిన్నంగా విభజించుకున్నామన్నారు. కోవిడ్ విశ్వమానవాలిని ఏకం చేసిందని, కులం, మతం దేవుడు పుట్టించలేదు. మనకు మనం తయారు చేసుకుందన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు కుల, ధన బలం లేదని, కేసీఆర్ ఉద్యమాన్ని కేవలం తన వాక్శుద్ధితోనే ప్రారంభించారన్నారు.
ఇండియా ఫోకస్ అంతా కులం, మతం పై మాత్రమే ఉందని మండిపడ్డారు. నిన్న ఒకాయన వచ్చిన పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి పోయారని, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపి, తెలంగాణలో బీఅరెస్ ప్రభుత్వానికి 9ఏళ్ళు పూర్తి అయిందన్నారు. కేంద్రం తలసరి ఆదాయం ఎట్లా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం ఎలా ఉందో కేంద్రం చెప్పాలని, పంచాయితీ రాజ్ శాఖకు కేంద్రం 30 అవార్డులు ఇచ్చింది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇలా పనితీరు ఎందుకు లేదని ప్రశ్నించారు. మతాలు, కులాల పేరు మీద పనికిమాలిన పంచాయితీలు పెడితే అభివృద్ధి జరగదన్నారు. జీవితం చాలా పరిమితం.. వెయ్యి ఏళ్ళు బతకడానికి పుట్టలేదన్నారు.
Also Read..