Hydra Traffic Volunteer : హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్.. ర‌ద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సేవ‌లు

by Ramesh N |
Hydra Traffic Volunteer : హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్.. ర‌ద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సేవ‌లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి అందరికీ తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా లోని DRF డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించింది. మొద‌టి విడ‌త‌గా Traffic Control శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 50 మంది హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నగరంలో విధులు నిర్వహిస్తున్నారు. నగరంలోని గోషామహాల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో డీఆర్ఎఫ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు.

HYDRA TRAFFIC VOLUNTEER హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్‌ల పేరిట న‌గ‌రంలోని ముఖ్య‌మైన కూడ‌ళ్లు, ర‌ద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల‌కు తోడుగా సేవ‌లు అందిస్తున్నారు. అసెంబ్లీ, ఖైరతాబాద్‌ చౌరస్తా, తెలుగు ఫ్లైఓవర్‌, ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్ద బుధవారం వాలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణ చేశారు. కాగా, భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో ఈ డీఆర్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించే వారు.. ట్రాఫిక్ రద్దీ, ఇతర ముఖ్యమైన సమయాలలో పోలీసులకు సహకరించే విధంగా హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల సేవలుంటాయని HYDRA హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చెప్పారు.

Advertisement

Next Story