HYDRA: గుడికి, స్మశాన వాటికకు హైడ్రా నోటీసులు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |
HYDRA: గుడికి, స్మశాన వాటికకు హైడ్రా నోటీసులు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ కట్టడం అంటూ గుడికి, స్మశాన వాటికకు హైడ్రా నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల కింద ఉన్న గుడి అని దానికి హైడ్రా నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. మరోవైపు తమ పరిధిలోని ఓ స్మశాన వాటికకు కూడా నోటిసులు ఇచ్చారని ఇవన్నీ తీస్తే ఎలా? అదే ప్రాంతంలో 40 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న పేద ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

హైడ్రాని అభినందిస్తున్న కానీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అన్యాయం జరగకుండా రాజకీయాలకు అతీతంగా హైడ్రా నిర్వహించాలన్నారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టామని తెలిపారు. అందులో 60 వేల ఇండ్లు పేదలకు ఇచ్చేశామని, ఇంకా 40 వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఎవరైతే చెరువుల దగ్గర నాలాల దగ్గర ఇల్లు కట్టుకున్న పేద ప్రజలు ఉన్నారో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed