మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. పెట్రోల్ పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నం

by Gantepaka Srikanth |
మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. పెట్రోల్ పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మాదాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సున్నపుచెరువు వద్ద అక్రమ నిర్మాణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో నిర్మాణాలకు చెందిన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. దీంతో పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ భవనాలు కూల్చివేస్తే ఒంటికి నిప్పంటిచుకొని తగులబెట్టుకుంటామని అధికారులను హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీస్తున్నారు.

కాగా, ఆదివారం ఉదయమే హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. నగర నలువైపులా కూల్చివేతలు ప్రారంభించారు. ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో చేపట్టిన నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్నారు. సున్నం చెరువు 26 ఎకరాలలో విస్తరించి ఉంది. అయితే ఈ చెరువు చాలాకాలంగా కబ్జాలకు గురవుతుంది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే సర్వే నంబర్‌ 13, సర్వే నంబర్‌ 14, సర్వే నంబర్‌ 16 ఉన్నట్లుగా నిర్ధారించింది. ఆ సర్వే నంబర్లలోనే బఫర్‌ జోన్లు ఉన్నాయి. కొందరు కబ్జారాయుళ్లు దానిని ముందుకు జరపగా.. ఇంకొందరు ఫెన్సింగే లేకుండా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో పక్కా ఆధారంలో కూల్చివేతలు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed