ఆ పర్మిషన్లను వెంటనే రద్దు చేయండి.. HMDA కు లేఖ రాసిన హైడ్రా కమిషనర్

by Mahesh |
ఆ పర్మిషన్లను వెంటనే రద్దు చేయండి.. HMDA కు లేఖ రాసిన హైడ్రా కమిషనర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా అక్రమ కట్టడాలపై తన పంజా విసురుతుంది. అక్రమ కట్టడాలపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కూడా కేటాయించింది. అలాగే హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని మంత్రి మండలి కూడా నిర్ణయించింది. దీంతో హైడ్రాకు ప్రభుత్వం నుంచి ఫుల్ పవర్స్ లభించినట్లయింది. ఈ క్రమంలో చెరువుల్లో నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. FTL, బఫర్‌ జోన్ లలో నిర్మాణాలకు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయాలని..హైడ్రా కమిషనర్.. HMDA కు లేఖ రాశారు. ఆయా కట్టడాలపై హెచ్ఎమ్‌డీఏ అనుమతులను మరోసారి రీ వెరిఫై చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. అలాగే కోమటికుంట తో పాటు 5 చెరువులో.. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్‌ రద్దు చేయాలని హెచ్‌ఎమ్‌డీఏకు రాసిన లేఖలో హైడ్రా కమిషనర్ కోరారు.

Next Story

Most Viewed