- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈయన అడగడు.. ఆయన ఇవ్వడు: YS Sharmila
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రధానికి అడుగు పెట్టే అర్హత లేదంటున్న ఈ బందిపోట్లకు ఎదురెళ్లి మోడీని నిలదీసే దమ్ము మాత్రం లేదని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ జగన్ విమర్శించారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. రాష్ట్ర హక్కులను ‘ఈయన అడగడు.. ఆయన ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు’. అని షర్మిల ఎద్దేవా చేశారు. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. 5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారని ప్రశ్నించారు. విభజన హామీల సంగతి ఏంటని ఎందుకు ప్రశ్నించలేదని షర్మిల నిలదీశారు.
‘తెలంగాణకు దక్కాల్సిన నిధులపై ఎందుకు నిలదీయలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అనుమతులపై చేసిన పోరాటాలు ఎక్కడ. కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల్లో రాష్ట్ర వాటా ఏదని అడిగారా?. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వ విద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల సంగతిపై పోరాడారా?. ఏటా బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి ఇస్తుంటే బీఆర్ఎస్ ఎంపీలు చేతకాని దద్దమ్మలు కాలేదా?. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే "బీజేపీ రాష్ట్ర సమితి" దోస్తానా. దొరకు కుటుంబ క్షేమంపై ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమంపై సోయి రాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీ వద్ద మోకరిల్లి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ కేసీఆర్ అండ్ కోకు రాష్ట్రంలో ఉండే అర్హతే లేదు.’ అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రధానికి అడుగు పెట్టే అర్హత లేదంటున్న ఈ బందిపోట్లకు ఎదురెళ్లి మోడీని నిలదీసే దమ్ము మాత్రం లేదు. ఈయన అడగడు.. ఆయన ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. 5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారు? విభజన హామీల సంగతి ఏంటని…
— YS Sharmila (@realyssharmila) September 27, 2023