సోషల్ మీడియాలో బూతులు.. డ్రైవ్ ఇన్ లో హల్‌చల్

by Sathputhe Rajesh |
సోషల్ మీడియాలో బూతులు.. డ్రైవ్ ఇన్ లో హల్‌చల్
X

దిశ, శేరిలింగంపల్లి: సోషల్ మీడియాలో మాటామాటా పెరిగి ఏకంగా తన్నుకునేందుకు సిద్ధమయ్యారు కొందరు యువతీయువకులు. అంతటితో ఆగని వారు డ్రైవ్ ఇన్'y లో కుర్చీలు, బల్లలు విరగొట్టి నానా హంగామాచేసిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సోషల్ మీడియా అప్లికేషన్ లో కొందరు యువతీయువకుల మధ్య మాటామాటా పెరిగింది. తప్పతాగిన యువతీ యువకులు ఆ యాప్ లోనే పరస్పరం బూతులు తిట్టుకున్నారు. అనంతరం తిట్లు వ్యక్తిగతంగా మారి వారు ఒకరికొకరు తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ విసురుకున్నారు. దీంతో మాదాపూర్ లో ఉన్న రెట్రో డ్రైవ్ ఇన్ దగ్గర కలుద్దాం అని ప్లేస్ చెప్పుకొని ఒక వర్గం వారు వచ్చి గట్టిగా అరుస్తూ రెట్రో డ్రైవ్ ఇన్ లోని కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన వారిని తోసివేస్తూ నానా హంగామా చేశారు. డ్రైవ్ ఇన్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story