- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూపార్కులో ప్రపంచ ఏనుగుల దినోత్సవం..
దిశ, చార్మినార్ః నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జూపార్కులోని ఏనుగుల కోసం సలాడ్, చెరుకు ముక్కలు, రాగి, రైస్, పండ్లు, కీర, క్యారెట్, కూరగాయలు, మొలకలు, మొక్కజొన్నలు, బెల్లంతో ప్రత్యేకంగా తయారుచేయించిన కేక్‌తో పాటు కొబ్బరి, పచ్చిగడ్డి, అరటి పండ్లును ఆహారంగా అందించారు. ఈ సందర్భంగా వనజ, ఆశ, సీత, విజయ్ అనే నాలుగు ఆసియా ఏనుగుల ముందు కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ డాక్టర్ సునీల్ఎస్.హిరేమత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూరేటర్ డాక్టర్ సునీల్ఎస్.హిరేమత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు12వ తేదీన ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూ డిప్యూటి క్యూరేటర్ ఎ.నాగమణి, వెటర్నరీ డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ ఎం. ఎ హకీం, అసిస్టెంట్ క్యూరేటర్లు అమృతమ్మ, లక్ష్మణ్ బాణావట్, విష్ణువర్థన్, డిప్యూటి ఆర్ఓ డాక్టర్ డాక్టర్ బాబురావు, కె.మోహన్, గణేష్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.